Banswada News
బాగ్‌బాన్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
Quick Summary:
జాతీయ జెండాను ఆవిష్కరించిన మొహమ్మద్ కాజీమ్
5టీవీ న్యూస్ బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని బాగ్‌బాన్ కమిటీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ కాజీమ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపిస్తూ జెండాకు గౌరవ వందనం చేశారు.ఈ సందర్భంగా మొహమ్మద్ కాజీమ్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకొని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. కుల, మత భేదాలకు అతీతంగా అందరూ సోదరభావంతో మెలగుతూ దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం కమిటీ సభ్యులు, స్థానికులు పరస్పరం స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.ఈ కార్యక్రమంలో బాగ్‌బాన్ కమిటీ ఉపాధ్యక్షులు మొహమ్మద్ ఫాజిల్ , కార్యదర్శి మహమ్మద్ ఫరూక్ , బాగ్‌బాన్ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు, యువకులు,చిన్నారులు,పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
