Banswada News
హన్మంత్ షిండేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన షేక్ బాబు.
Quick Summary:
ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలి.
5టీవీ న్యూస్ బాన్సువాడ : జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే జన్మదినం సందర్భంగా ఆయనకు పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మల్లాపూర్ సర్పంచ్ అభ్యర్థి షేక్ బాబు సాహెబ్ హన్మంత్ షిండేకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల కోసం నిరంతరం పనిచేసే జన నాయకుడిగా హన్మంత్ షిండే మరింత కాలం ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.హన్మంత్ షిండేకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరారు.