Fri, Jul 31, 2026
YouTube
Rivx Studios
News Thumb మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి. News Thumb 11 మంది చిన్నారులు, ఓ మహిళపై కుక్కల దాడి...మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆందోళన. News Thumb కుక్కలు, కోతుల బెడుద నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ. News Thumb రూ.21 లక్షల చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. News Thumb చెక్‌డ్యామ్‌లో జలకళ.. గంగమ్మ తల్లికి ఎమ్మెల్యే పోచారం ప్రత్యేక పూజలు... News Thumb లయన్ బాబురావు జన్మదినోత్సవం.. అయ్యప్ప ఆలయం వద్ద అన్నదాన సేవ News Thumb బాన్సువాడలో వీధి కుక్కల బీభత్సం.. రెండు రోజుల్లో 10 మంది చిన్నారులు కుక్క కాటుకు గురి. News Thumb కుక్క దాడిలో గాయపడిన చిన్నారిని పరామర్శించిన మున్సిపల్ కమిషనర్ గోవు గంగాధర్. News Thumb మదీనా కాలనీ ఘటన మరువకముందే.. మరో చిన్నారిపై కుక్కల దాడి... News Thumb రిపుల్స్ లెర్నింగ్ పాఠశాలలో బ్లూ కలర్ డే. News Thumb బాన్సువాడలో వీధి కుక్కల దాడిలో నలుగురు చిన్నారులకు తీవ్ర గాయాలు... News Thumb ప్రాజెక్టులోకి 24 గంటల్లో 3,935 క్యూసెక్కుల వరద నీరు.. నీటిమట్టం పెరుగుదల. News Thumb బాన్సువాడలో త్రాగునీటిపై మున్సిపాలిటీ హెచ్చరిక. News Thumb రేషన్ లబ్ధిదారులు ఈ నెల 31లోగా ఈకేవైసీ పూర్తిచేసుకోవాలి. News Thumb తాడ్కోల్ లో భారీ కార్డన్ సెర్చ్.. 13 బైక్‌లు, ఓ ఆటో సీజ్... News Thumb గతంలో చేపట్టిన డ్రైనేజీ పూడికతీత పనుల ఫలితం... News Thumb బాన్సువాడలో మూడేళ్ల చిన్నారిపై వీధి కుక్కల దాడి... News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం News Thumb మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి. News Thumb 11 మంది చిన్నారులు, ఓ మహిళపై కుక్కల దాడి...మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆందోళన. News Thumb కుక్కలు, కోతుల బెడుద నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ. News Thumb రూ.21 లక్షల చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. News Thumb చెక్‌డ్యామ్‌లో జలకళ.. గంగమ్మ తల్లికి ఎమ్మెల్యే పోచారం ప్రత్యేక పూజలు... News Thumb లయన్ బాబురావు జన్మదినోత్సవం.. అయ్యప్ప ఆలయం వద్ద అన్నదాన సేవ News Thumb బాన్సువాడలో వీధి కుక్కల బీభత్సం.. రెండు రోజుల్లో 10 మంది చిన్నారులు కుక్క కాటుకు గురి. News Thumb కుక్క దాడిలో గాయపడిన చిన్నారిని పరామర్శించిన మున్సిపల్ కమిషనర్ గోవు గంగాధర్. News Thumb మదీనా కాలనీ ఘటన మరువకముందే.. మరో చిన్నారిపై కుక్కల దాడి... News Thumb రిపుల్స్ లెర్నింగ్ పాఠశాలలో బ్లూ కలర్ డే. News Thumb బాన్సువాడలో వీధి కుక్కల దాడిలో నలుగురు చిన్నారులకు తీవ్ర గాయాలు... News Thumb ప్రాజెక్టులోకి 24 గంటల్లో 3,935 క్యూసెక్కుల వరద నీరు.. నీటిమట్టం పెరుగుదల. News Thumb బాన్సువాడలో త్రాగునీటిపై మున్సిపాలిటీ హెచ్చరిక. News Thumb రేషన్ లబ్ధిదారులు ఈ నెల 31లోగా ఈకేవైసీ పూర్తిచేసుకోవాలి. News Thumb తాడ్కోల్ లో భారీ కార్డన్ సెర్చ్.. 13 బైక్‌లు, ఓ ఆటో సీజ్... News Thumb గతంలో చేపట్టిన డ్రైనేజీ పూడికతీత పనుల ఫలితం... News Thumb బాన్సువాడలో మూడేళ్ల చిన్నారిపై వీధి కుక్కల దాడి... News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం
తాజా వార్తలు
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి. - Rivx Studios
Telangana

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి.

Published on July 31, 2026 at 5:51 AM

3,689 Views

News Image
Quick Summary:

తెలంగాణ ఉద్యమ కారులు.

5టీవీ ప్రతినిధి : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి శుక్రవారం (జులై 31) అర్ధరాత్రి కన్నుమూశారు. పల్మనరీ ఎంబోలిజం కారణంగా గుండె ఆగిపోవడం, నాడీ వ్యవస్థ స్పందించకపోవడంతో ఆయన మరణించారు.సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. పెద్ది మృతిపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు. ఈరోజు పెద్ది స్వగ్రామమైన నల్లబెల్లిలో మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి జీవిత విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం..

బాల్యం - జీవితం..

తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి 1974 ఆగస్టు 6న వరంగల్ గ్రామీణ జిల్లా (అప్పటి) నల్లబెల్లిలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు రాజిరెడ్డి, అమృతమ్మ. వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన పెద్ది.. 1991లో వరంగల్‌లోని మహబూబియా పంజాథన్ కాలేజీ నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. అనంతరం స్వప్నతో వివాహం జరగగా, వారికి కుమారుడు నిధర్షన్ రెడ్డి, కుమార్తె ధర్మిష్ఠ రెడ్డి ఉన్నారు.

రాజకీయ ప్రస్థానం..

యూత్ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సుదర్శన్ రెడ్డి 2001లో పార్టీ ఆవిర్భావ సమయంలోనే తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. నల్లబెల్లి మండలం నుంచి జెడ్పీటీసీగా గెలిచి జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడిగా సేవలందించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ వరంగల్ కేంద్రంగా జరిగిన సభలు, మహాగర్జన సభల్లో చురుకుగా పాల్గొన్నారు. కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా అకుంఠిత దీక్షతో విజయవంతంగా నిర్వహించేవారు.

తొలిసారి ఎమ్మెల్యేగా..

2014 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి నర్సంపేట నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు. 2018లో రెండో ప్రయత్నంలో ఘన విజయం సాధించి నర్సంపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018 నుంచి 2023 వరకు తెలంగాణ పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌గా, శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) సభ్యుడిగానూ బాధ్యతలు నిర్వహించారు. నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ రోడ్లు, తాగునీరు, వ్యవసాయ సమస్యలు, కరోనా కాలంలో సహాయక చర్యలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజా సేవలో చురుకైన నాయకుడిగా పార్టీ శ్రేణుల్లో, సాధారణ ప్రజల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.పెద్ది సుదర్శన్ రెడ్డి మరణంతో బీఆర్ఎస్ శ్రేణులు, నర్సంపేట ప్రాంత ప్రజలు, తెలంగాణ రాజకీయ వర్గాలు విషాదంలో మునిగిపోయాయి. తెలంగాణ ఉద్యమ నేత నుంచి ఎమ్మెల్యే వరకూ ఆయన చేసిన ప్రజా సేవ, జ్ఞాపకాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పేర్కొంటున్నారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com