KAMAREDDY
శాంతాపూర్‌లో అన్నాభావు సాఠే 106వ జయంతి.
Quick Summary:
లోక్‌షాహీర్ అన్నాభావు సాఠే 106వ జయంతి
5టీవీ న్యూస్ ప్రతినిధి కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం శాంతాపూర్ గ్రామంలో సాహిత్య రత్న, లోక్‌షాహీర్ అన్నాభావు సాఠే 106వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుసేగం భూమయ్య మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అన్నాభావు సాఠే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా రుసేగం భూమయ్య మాదిగ మాట్లాడుతూ.. అన్నాభావు సాఠే అణగారిన వర్గాల కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడని అన్నారు. కవి, కళాకారుడు, రచయితగా ప్రజల కష్టాలను తన సాహిత్యంలో ప్రతిబింబించి, అట్టడుగు వర్గాల గొంతుకగా నిలిచారని కొనియాడారు. పేదలు, కూలీలు, బడుగు బలహీన వర్గాల జీవన విధానాన్ని కళ్లకు కట్టినట్లు తన రచనల్లో చిత్రీకరించారని తెలిపారు.అన్నాభావు సాఠే మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా వాటేగావ్ గ్రామంలో మాతంగి సామాజిక వర్గంలో జన్మించారని, పేదరికం కారణంగా ప్రాథమిక విద్యను కూడా పూర్తిగా అభ్యసించలేకపోయినా తన ప్రతిభతో గొప్ప సాహితీవేత్తగా, ప్రజా నాయకుడిగా ఎదిగారని గుర్తుచేశారు. కష్టజీవుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు.అన్నాభావు సాఠే జయంతి కార్యక్రమాలను నెల రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడు సాయిలు, పెద్ద కొడప్‌గల్ మండల అధ్యక్షుడు సర్వగల రవీందర్, సీనియర్ నాయకులు మారుతి, ఉపాధ్యక్షుడు బలరాం, మండల సీనియర్ నాయకులు సాయిలు, మాజీ వార్డు నంబర్ హన్మాండ్లు, యూత్ అధ్యక్షుడు రవి, వీరేశం, మొగులయ్యతో పాటు ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.