Banswada News
ఆశన్న మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటు: రజినీకాంత్
Quick Summary:
కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా ప్రింట్ మీడియా అసోసియేషన్ ప్రతినిధులు
5టీవీ న్యూస్ ప్రతినిధి బాన్సువాడ : కామారెడ్డి జిల్లా సీనియర్ పాత్రికేయుడు ఆశన్న మృతికి జిల్లా ప్రింట్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు సీనియర్ పాత్రికేయులు ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా ప్రింట్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడు రజినీకాంత్ ఆశన్న పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.అనంతరం ఆశన్న కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆశన్న జర్నలిజం రంగానికి విశిష్ట సేవలు అందించారని, ఆయన నిబద్ధత, నిజాయితీ, వృత్తిపట్ల అంకితభావం యువ పాత్రికేయులకు ఎల్లప్పుడూ ఆదర్శంగా నిలుస్తాయని కొనియాడారు. ఆయన మరణం కామారెడ్డి జిల్లా పాత్రికేయ రంగానికి తీరని లోటని పేర్కొంటూ,ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పాత్రికేయులు పాల్గొని ఆశన్నకు పుష్పాంజలి ఘటించి, రెండు నిమిషాల మౌనం పాటించి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
