Banswada News
ట్రాఫిక్ సమస్యకు చెక్...కూరగాయల వ్యాపారులకు ప్రత్యేక స్థలం
Quick Summary:
వ్యాపారులు కేటాయించిన స్థలాల్లోనే విక్రయాలు జరపాలి - కాసుల బాలరాజ్.
5టీవీ న్యూస్ బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి పాత బాన్సువాడకు వెళ్లే ప్రధాన రహదారి పక్కన కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారులకు ప్రత్యేక స్థలం కేటాయించే చర్యలను మున్సిపల్ అధికారులు శుక్రవారం చేపట్టారు. రహదారి పక్కన వ్యాపారాల నిర్వహణతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తకుండా, వ్యాపారులకు కూడా సౌకర్యంగా ఉండేలా ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా కూరగాయల వ్యాపారులతో కలిసి ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ ప్రత్యేకంగా కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. ఒకే చోట వ్యాపారాలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేయడం వల్ల రహదారిపై ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు ప్రజలకు, వ్యాపారులకు సౌకర్యంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. వ్యాపారులందరూ తమకు కేటాయించిన స్థలాల్లోనే కూరగాయల విక్రయాలు నిర్వహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మహమ్మద్ ఖలేఖ్, కోఆప్షన్ సభ్యులు ఖామర్ సుల్తానా, గౌస్ పాషా, కాజిమ్‌తో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
